Balakrishna Targeted AP Govt in Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా లాల్, నవీన్ చంద్ర, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాలో బాలకృష్ణ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవచ్చని అంచనాలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి తగినట్లుగానే నందమూరి బాలకృష్ణ సినిమాలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగానే అనిపిస్తుంది. నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కామెంట్ చేయకపోయినా పరోక్షంగా అధికారంలో ఉన్న వారి మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉన్న వారికి గౌరవం ఇవ్వాలని చెబుతూనే వారంతా ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


అదే విధంగా అభివృద్ధి గురించి కూడా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి సాధించడం అంటే అభివృద్ధి ప్రజలను వేధించడం కాదు, జీతాలు ఇవ్వడం అభివృద్ధి, ఉద్యోగాలు తీయడం కాదు, పని చేయడం అభివృద్ధి పనులు ఆపడం కాదు, నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు, పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమలు పోగొట్టడం కాదు, అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం మీద బాలకృష్ణ సంధించిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ టార్గెట్ చేసిన కామెంట్లే.


నిజానికి నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉండడంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బావమరిది కావడంతో కావాలనే ఆయన సినిమా ద్వారా అధికార పార్టీని టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తోంది. అలాగే విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయం మీద కూడా బాలకృష్ణ ఒక డైలాగ్ సంధిస్తారు, బోర్డు మీద పేరు మార్చినంత మాత్రాన చరిత్ర మారిపోదు ఆ చరిత్ర సృష్టించిన వారి చరిత్ర చెరిగిపోదు, అది మా నాన్న రా అంటూ బాలకృష్ణ పలికిన డైలాగ్ సినిమాలో తన తండ్రిని ప్రస్తావించినా రియల్ గా తన తండ్రి ఎన్టీఆర్ పేరు మార్పు మీద ఈ కౌంటర్ వేశారనే వాదన వినిపిస్తోంది.  
Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం


Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook